Sircilla: పట్టణ పరిధిలో నంబర్ ప్లేట్ తొలగింపుపై ప్రత్యేక డ్రైవ్
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నంబర్ ప్లేట్ లేని, మార్ఫింగ్ చేసిన వాహనాలపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
Sircilla: పట్టణ పరిధిలో నంబర్ ప్లేట్ తొలగింపుపై ప్రత్యేక డ్రైవ్
సిరిసిల్ల: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నంబర్ ప్లేట్ తొలగింపు, నంబర్ ప్లేట్ మార్ఫింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా 20 వాహనాలు గుర్తించి జరిమానా విధించి,ఆయా వాహన యజమానుల ఆధ్వర్యంలో నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయించినట్లు సిరిసిల్ల పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
వాహనాలకు నంబర్ ప్లేట్ తొలగించి లేదా నంబర్లు స్పష్టంగా కనిపించకుండా మార్ఫింగ్ చేసి వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని,ఇటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు.
ప్రతి వాహనదారుడు తన వాహనానికి నంబర్ ప్లేట్‌ను స్పష్టంగా కనిపించే విధంగా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.సరైన నంబర్ ప్లేట్లు ఉండటం వల్ల దొంగిలించబడిన వాహనాలను గుర్తించడం, నేరాలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతుందని తెలిపారు
వాహనదారులకు గమనికగా, నంబర్ ప్లేట్ లేకుండా, నంబర్ ప్లేట్‌కు అడ్డుగా వస్తువులు ఏర్పాటు చేసి, లేదా నంబర్లు పూర్తిగా కనిపించకుండా, సగం నంబర్లు తొలగించి వాహనాలు నడిపితే చీటింగ్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




