Karimnagar: నూతన గృహప్రవేశంలో పాల్గొన్న పోల్సాని వేణు రావు, బండారి ప్రశాంత్!

Karimnagar: రామడుగు శ్రీనివాసరావు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి పోల్సాని వేణు రావు, బండారి ప్రశాంత్ హాజరై కుటుంబ సభ్యులకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.

GANESH, JAMMIKUNTA
Published on: 30 Aug 2026 5:16 PM IST
Karimnagar
X

Karimnagar: నూతన గృహప్రవేశంలో పాల్గొన్న పోల్సాని వేణు రావు, బండారి ప్రశాంత్!

కరీంనగర్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన రామడుగు అశ్విని శ్రీనివాసరావు కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన గృహప్రవేశ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో ఘనంగా జరిగింది.

ఈ శుభకార్యానికి పోల్సాని వేణు రావు , బండారి ప్రశాంత్ హాజరై నూతన గృహ యజమానులను ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహంలో అడుగుపెట్టిన కుటుంబానికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ప్రతి కుటుంబం సొంతింటి కలను సాకారం చేసుకోవడం ఎంతో ఆనందకరమైన విషయమని, కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంతో సంతోషంగా జీవించాలని కోరుకున్నారు.గ్రామ ప్రజలతో, కుటుంబాలతో ఎల్లప్పుడూ ఆత్మీయ సంబంధాలను కొనసాగిస్తూ, వారి సుఖదుఃఖాల్లో భాగస్వాములవుతూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామ ప్రముఖులు పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.పోల్సాని వేణు రావు, బండారి ప్రశాంత్.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story