Chigurumamidi: ఉనికి కోసమే రామచంద్రరావు దీక్ష మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు విమర్శలు!

Chigurumamidi: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దీక్షపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం. ఉనికి కాపాడుకోవడానికే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్య.

SRINIVAS, HUSNABAD
Published on: 24 Aug 2026 5:01 PM IST
Chigurumamidi
X

Chigurumamidi: ఉనికి కోసమే రామచంద్రరావు దీక్ష మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు విమర్శలు!

Chigurumamidi: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు దీక్ష గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నియామకం పొందినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర బిజెపి పార్టీ అంతర్గత విభేదాల్లో తన ప్రాబల్యం చూపెట్టుకొనడానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం ద్వారా ఆయన ఒక నాయకుడిగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.

రామచంద్ర రావుకు నిజంగా చాతనైతే, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే ఢిల్లీకి వెళ్లి కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన అంశాలను సాధించుకు రావాలని సూచించారు. రామచంద్రారావు చేస్తున్న దీక్ష ఫీజు రియంబర్స్మెంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ పాత బకాయిలను విడుతల వారీగా పేమెంట్ చేస్తూనే, ఈ విద్యా సంవత్సరం నుండి ఫీజు రియంబర్స్మెంట్ అడ్వాన్స్డ్ గా పేమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకొంటుదన్నారు.

భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ కు కేంద్రం నుండి ఏం సహకారం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు ఉంటే వారితో కుమ్మక్కైన పార్టీగా బిజెపి ఎందుకు స్పందించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ఉన్నత ఆలోచనలతో అన్ని స్థాయిల్లో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు.

సంక్షేమ హాస్టల్స్ కు గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తున్నామని, కిట్ ద్వారా నాణ్యమైన వస్తువులను సమకూరుస్తూ డైట్ చార్జీలు పెంచామన్నారు. భవిష్యత్తులో ఫీజ్ రియంబర్స్మెంట్ కు సంబంధించి అడ్వాన్స్ పేమెంట్ తీసుకొచ్చి బ్యాంకుల్లో ముందే డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చాతనైతే ముసలి కన్నీరు కార్చడం ఆపి రాజకీయ ఉనికి కోసం నిరాహార దీక్ష చేయడం మానుకోవాలని రామచంద్రరావుకు సూచించారు.

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చేలా ప్రయత్నం చేయాలన్నారు. కానీ నడిచే కాళ్లల్లో మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రగతికి సంబంధించి విమర్శలు చేయడం ద్వారా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆయన స్థాయి తగ్గించుకున్నట్టు అవుతుందని హితవు పలికారు.

SRINIVAS, HUSNABAD

SRINIVAS, HUSNABAD