Potkapalli: రైతులకు విజ్ఞప్తి.. రహదారులను కల్లాలుగా మార్చకండి

Potkapalli: రహదారులపై ధాన్యం ఆరబోసే రైతులపై పొత్కపల్లి పోలీసులు సీరియస్ అయ్యారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 20 April 2026 9:26 PM IST
Potkapalli
X

Potkapalli: రైతులకు విజ్ఞప్తి.. రహదారులను కల్లాలుగా మార్చకండి

Potkapalli: పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు రహదారులను కల్లాలుగా మార్చుకోవడంపై పొత్కపల్లి పోలీసులు సీరియస్ అయ్యారు. ఓదెల మండల పరిధిలోని ప్రధాన రహదారులపై వడ్లు, మొక్కజొన్నలు ఆరబోస్తే కఠిన చర్యలు తప్పవని పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ హెచ్చరించారు.

​ప్రమాదాలకు పొంచి ఉన్న ముప్పు

​రహదారులపై ధాన్యం ఆరబోయడం, వడ్ల కుప్పలపై పరదాలు వేసి రాళ్లు పెట్టడం వల్ల వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారని, దీనివల్ల ప్రాణనష్టం జరుగుతోందని ఎస్సై ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గుండ్లపల్లి - గుంపుల గూడెం మరియు ఓదెల - కొలనూరు డబుల్ రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు.

​పోలీసుల కీలక ఆదేశాలు:

​22 గ్రామాల రైతులకు విజ్ఞప్తి: ఓదెల మండలంలోని అన్ని గ్రామాల రైతులు ధాన్యం ఆరబోయడానికి రహదారులను వాడకూడదు.

జరిమానా: నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై ఆటంకం కలిగిస్తే రూ. 5000 జరిమానా విధిస్తాం.

​క్రిమినల్ కేసులు: రోడ్లపై ధాన్యం వేయడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవిస్తే, సదరు యజమానులపై చట్టప్రకారం కఠినమైన కేసులు నమోదు చేస్తాం.

ప్రత్యామ్నాయం: రైతులు తమ పంటను ఆరబోసుకోవడానికి తగు స్థలాలను లేదా కల్లాలను చూసుకోవాలని సూచించారు.

​రైతు సంక్షేమంతో పాటు ప్రయాణికుల భద్రత కూడా ముఖ్యమని, కావున మండల రైతులందరూ పోలీసులకు సహకరించాలని ఎస్సై దీకొండ రమేష్ కోరారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story