Jagtial: చేనేత కార్మికుల పింఛన్ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించాలి: సతీష్

Jagtial: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న పింఛన్ సమస్యను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పొట్టవత్తిని సతీష్ విజ్ఞప్తి చేశారు.

ANAND, JAGITYAL
Published on: 25 Nov 2026 5:22 PM IST
Jagtial
X

Jagtial: చేనేత కార్మికుల పింఛన్ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించాలి: సతీష్

Jagtial: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న పింఛన్ సమస్యను ప్రధాన ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పొట్టవత్తిని సతీష్ కోరారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. అసెంబ్లీలోనూ, ఇతర వేదికలపైనా ఈ అంశంపై పోరాడి అర్హులైన కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు అందించే పింఛన్ కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని, జీవితాంతం మగ్గంపై శ్రమించిన వారి హక్కు మరియు కనీస సామాజిక భద్రత అని పేర్కొన్నారు. అర్హులైన ఏ ఒక్క కార్మికుడు కూడా అన్యాయానికి గురికాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత రంగాన్ని ఆదుకునే విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కార్మికులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL