Karimnagar: పోలీసింగ్ అంటే ఇది కాదు నక్సలైట్లపై ఉన్న శ్రద్ధ దొంగలపై ఏది
Karimnagar: కరీంనగర్ లో జరిగిన భారీ దోపిడీ ఘటనపై ప్రజా మిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ మండిపడ్డారు.
Karimnagar: పోలీసింగ్ అంటే ఇది కాదు నక్సలైట్లపై ఉన్న శ్రద్ధ దొంగలపై ఏది
కరీంనగర్: పోలీసులు దొంగల ముఠాలను అరికట్టాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. ప్రజామిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజుల క్రితం కరీంనగర్ లో పట్టపగలు జరిగిన దోపిడి, తుపాకులు వాడి కాల్పులు జరిపి నలుగురిని గాయపరిచి దాదాపు రెండు కోట్ల విలువ చేసే కిలో నర బంగారాన్ని దొంగలు దోపిడి చేసి పరార్ అయిపోతే పోలీసింగ్ ఎట్లా చేయాల్సి ఉండే, కరీంనగర్ పట్టణం నుంచి కరీంనగర్ నలుగు దిశల 50 కిలోమీటర్ల వరకు రెడ్ అలర్ట్ ప్రకటించి అష్టదిగ్బంధనం చేయాల్సి ఉండేదన్నారు.
ఇది చేయాల్సినది హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ నుండి ఆర్డర్ జారీ చేయాల్సి ఉండే, చిన్న జిల్లాల వలన ఈ సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు. కరీంనగర్ జిల్లా బార్డర్ దాటితే కరీంనగర్ సీపీకి జూరి డిక్షన్ పవర్స్ ఉండవన్నారు. 1990 నుంచి 2010 వరకు ఒక పకడ్బందీ పోలీసు వ్యవస్థ తెలంగాణలో ఉండేది అన్నారు. ఆ కాలంలో పనిచేసిన పోలీస్ అధికారులను అడిగితే వివరంగా విషయాలను చెప్తారని అన్నారు. ఈ విషయంలో అధికార పార్టీ నాయకులు ఒక తీరు మాట్లాడడం, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒక తీరు మాట్లాడడం సరి కాదన్నారు.
ఈ రెండు పార్టీల నాయకులు కొత్తగా వచ్చిన డీజీపీ ఆనంద్ కు తగిన సూచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద పెద్ద నక్సల్స్ నాయకులను పట్టుకోవడంలో ఉన్న శ్రద్ధ దొంగలను పట్టుకోవడంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. కావున భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని, డిజిపి ఆనంద్ ను కోరారు. ఈ మీడియా సమావేశంలో చిగిరి శ్రీధర్, బోయినపల్లి చంద్రయ్య,కొంపెల్లి రవీందర్,సిలివేరి రవీందర్, గజ్జల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.




