Karimnagar: కరీంనగర్ ప్రజావాణికి 145 దరఖాస్తులు.. స్వీకరించిన కలెక్టర్ చిత్రా మిశ్రా!

Karimnagar: కరీంనగర్ ప్రజావాణిలో 145 దరఖాస్తులను కలెక్టర్ చిత్రా మిశ్రా స్వీకరించారు. వచ్చే వారం నుంచి నూతన కలెక్టరేట్ భవనంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 5 Oct 2026 6:29 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ ప్రజావాణికి 145 దరఖాస్తులు.. స్వీకరించిన కలెక్టర్ చిత్రా మిశ్రా!

కరీంనగర్: పాత కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 145 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి స్వామి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇక నుండి కొత్త కలెక్టరేట్ లో "ప్రజావాణి ".

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వచ్చే వారం నుండి నూతన కలెక్టరేట్ (IDOC) మీటింగ్ హాల్ లో నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే సోమవారం నుండి నూతన కలెక్టరేట్ సమావేశ మందిరం పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రజావాణి కార్యక్రమం అక్కడే నిర్వహిస్తామని పేర్కొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN