Karimnagar: వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌పై శ్రీదేవిని కలిసిన ప్రణవ్

Karimnagar: హుజురాబాద్ సిర్సపల్లిలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ మార్పు కోసం ప్రణవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవిని కలిశారు.

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar
Published on: 21 April 2026 9:44 AM IST
Karimnagar
X

Karimnagar

Karimnagar: హైదరాబాద్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవిని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కలిశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పరిధిలోని సిర్సపల్లి ప్రాంతంలో ప్రతిపాదిత వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌పై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ప్లాంట్‌ను వేరే ప్రాంతానికి తరలించే అవకాశాలపై చర్యలు తీసుకోవాలని ప్రణవ్ వినతి పత్రం సమర్పించారు. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

సిర్సపల్లి ప్రాంతంలో నివాసాలకు సమీపంలో ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ అంశంపై త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి తెలియజేయనున్నట్లు ప్రణవ్ పేర్కొన్నారు.

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న సీనియర్ పాత్రికేయులు మరియు ‘రీజినల్ కోఆర్డినేటర్’.

Next Story