Kamanpur: వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు!
Kamanpur: వేసవి, ఎల్ నినో దృష్ట్యా తాగునీటి ఎద్దడి నివారణకు కమాన్ పూర్ మండలం నాగారంలో మిషన్ భగీరథ అధికారులు బుధవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
Kamanpur: వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు!
మంథాని: రానున్న వేసవి మరియు ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా గ్రామంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం నాగారం గ్రామ పంచాయతీలో మిషన్ భగీరథ అధికారులు బుధవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
సర్పంచ్ పొనగంటి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమంలో మిషన్ భగీరథ అంతర్గత సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ ప్రణవ్, పంపిణీ వ్యవస్థ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ నిత్య, ఉప సర్పంచ్ ఓడ్నాల శ్రీనివాస్ , వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ సాగి శ్రీధర్ రావు పాల్గొన్నారు.
గ్రామంలోని మిషన్ భగీరథ పంపిణీ వ్యవస్థ నీటి సరఫరాతో పాటు, స్థానిక నీటి వనరులైన బావులు, బోరుబావులు, చేతిపంపుల పనితీరును వారు క్షుణ్ణంగా పరిశీలించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులు సిబ్బందికి సూచించారు. వేసవిలో ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ పొనగంటి కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.




