Sircilla: ఆచార్య జయశంకర్ ఆశయాలు ఆదర్శనీయం: కమాండెంట్ ఛటర్జీ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌లో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
Sircilla: ఆచార్య జయశంకర్ ఆశయాలు ఆదర్శనీయం: కమాండెంట్ ఛటర్జీ!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ పి.జె.పి.సి. ఛటర్జీ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ జీవితాంతం అంకితభావంతో చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన ఉద్యమం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు.
విద్యావేత్తగా, మేధావిగా, సమాజ చైతన్యవేత్తగా ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న కమాండెంట్, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో ప్రజలకు సేవలందించాలని సూచించారు. అసిస్టెంట్ కమాండెంట్ సురేష్ మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ జీవితం యువతకు మార్గదర్శకమని, ఆయన చూపిన దారిలో సమాజాభివృద్ధి, ప్రజాసేవ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, మినిస్టీరియల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన ఆశయాలను ఆచరిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సంకల్పించారు.




