Karimnagar: రాజ్యాంగం కల్పించిన గిరిజన హక్కులను కాపాడాలి: బీమా సాహెబ్ డిమాండ్!
Karimnagar: కరీంనగర్‌లో ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బీమా సాహెబ్ కొమురం భీం విగ్రహానికి నివాళులర్పించారు.
Karimnagar: రాజ్యాంగం కల్పించిన గిరిజన హక్కులను కాపాడాలి: బీమా సాహెబ్ డిమాండ్!
కరీంనగర్: భారత రాజ్యాంగం దేశంలో కల్పించిన గిరిజన హక్కులను ప్రభుత్వాలు కాపడాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బీమా సాహెబ్ పేర్కొన్నారు. కరీంనగర్ లో నిర్వహించిన ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం సందర్భంగా గిరిజన పోరాటైదురుడు కొమరం భీమ్ కు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1994 ఆగస్టు 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసి గిరిజన హక్కుల దినోత్సవం గా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని తెలిపారు. ప్రపంచంలో ఆదివాసి గిరిజన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు. కానీ భారత ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టం 2023 పేరుతోటి గిరిజనులను అడవి ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుందని తెలిపారు.
అలాగే తెలంగాణ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బయ్యారం ఉక్కు పరిశ్రమను పూర్తిచేస్తే రాష్ట్రంలో ఉన్న 5,000 మంది గిరిజన యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని పేర్కొన్నారు. గిరిజనులకు దక్కాల్సిన విద్య ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం కృషి చేయాలని లేని పక్షంలో రానున్న కాలంలో గిరిజన యువత జంజీ ఉద్యమానికి పూనుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు గిరిజన సంఘం నగర అధ్యక్షుడు ప్రకాష్ నాయక్, కిరణ్, శ్రీనాథ్, సురేష్, శ్రీకాంత్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.




