Yellareddypet: యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టే దుస్థితి!

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పీఏసీఎస్ వద్ద యూరియా కొరతపై రైతులు, బీఆర్‌ఎస్ నేతలు నిరసన చేపట్టారు. యూరియా సకాలంలో అందించాలని, డిమాండ్ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 3 Sept 2026 2:58 PM IST
Yellareddypet
X

Yellareddypet: యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టే దుస్థితి!

Yellareddypet: తెలంగాణలో యూరియా కొరతపై రైతుల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆరు గ్యారంటీలు.. 420 హామీలు ఏమయ్యాయంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు నిరసన చేపట్టారు.

ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఎదుట భారీగా చేరిన రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను వివరించారు. యూరియా బస్తాల కోసం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూలో నిలబడాల్సి వస్తోందని.. కొందరు రైతులు తమ చెప్పులను లైన్లో పెట్టి వంతు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

యూరియా బుకింగ్‌కు అమలు చేస్తున్న స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్ విధానంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్మార్ట్‌ఫోన్ వినియోగం తెలియని నిరుపేద రైతులు యూరియాను ఎలా బుక్ చేసుకోవాలని ప్రశ్నించారు.

“రైతే ఏడ్చిన రాజ్యం.. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడినట్లు చరిత్రలోనే లేదు” అంటూ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, యూరియా కొరతను పరిష్కరించి ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story