Sircilla: సైకాలజిస్ట్ పున్నంచందర్‌కు 'బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు!
Sircilla: చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తున్న సిరిసిల్లకు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్‌కు 'బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది.
Sircilla: సైకాలజిస్ట్ పున్నంచందర్‌కు 'బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు!
సిరిసిల్ల: తెలంగాణ సారస్వత పరిషత్‌లో శుక్రవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో సైకాలజిస్ట్ కె. పున్నంచందర్‌కు “బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్” అవార్డు లభించింది.
సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మానసిక ఆరోగ్య రంగంలో పున్నంచందర్ అందిస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారం ప్రదానం చేశారు. గత 16 ఏళ్లుగా కౌన్సెలింగ్ ద్వారా చేనేత, పవర్‌లూమ్ కార్మికుల ఆత్మహత్యల నివారణకు కృషి చేయడంతో పాటు మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నందుకు అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
హ్యూమన్ రైట్స్ కౌన్సెల్ సంస్థ జాతీయ అధ్యక్షుడు కొప్పుల విజయకుమార్, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కె. రాములు, విమెన్ సేఫ్టీ తెలంగాణ వింగ్ సురేఖ చేతుల మీదుగా పున్నంచందర్ అవార్డును అందుకున్నారు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సామాజిక సేవలు అందిస్తున్న అలువాల ఈశ్వర్‌కు బెస్ట్ నేషనల్ సోషల్ సర్వీస్ అవార్డు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న గడ్డం దినకర్‌కు మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో అవార్డు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోత్కూరి రామచందర్‌తో పాటు పలు సంఘాల ప్రతినిధులు, సభ్యులు పున్నంచందర్, అలువాల ఈశ్వర్, గడ్డం దినకర్‌లను అభినందించారు. మానసిక ఆరోగ్యం, సామాజిక సేవ, గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ముగ్గురికి ఒకే వేదికపై అవార్డులు లభించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.




