Peddapalli: కార్మికులను అణచివేస్తే ఊరుకోం.. మంథనిలో పుట్ట మధు హెచ్చరిక

Peddapalli: మంథని ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సమ్మెలో పాల్గొన్న పుట్ట మధు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పట్ల అనుసరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు.

SHANKAR, MANTHANI
Published on: 23 April 2026 4:05 PM IST
Peddapalli
X

Peddapalli: కార్మికులను అణచివేస్తే ఊరుకోం.. మంథనిలో పుట్ట మధు హెచ్చరిక

పెద్దపల్లి జిల్లా: మంథని ఆర్టీసీ డిపో వద్ద ఆర్టిసి కార్మికులు చేస్తున్న సమ్మెలో పుట్ట మధు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ.. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి కనికరం లేదని అధికారంలో లేనప్పుడు ఎలా ఉంటదో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందో స్పష్టంగా ఈరోజు కనపడుతుందన్నారు. ఏఐ ఉండి ప్రపంచాన్ని చూడగలుగుతున్న ఈ రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుంది అందుకే పాకిస్తాన్ తీవ్రవాదులతో పోల్చానాని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మానిపేస్టే నే మా హామీ పత్రం అని చెప్పి ఈ రోజు తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ 1947 లో కార్మికుల హక్కులకు శ్రీకారం చుట్టారని న్యాయబద్ధంగా చేస్తున్నప్పటికీ కార్మికులను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడున్న సిఐ ని టెంట్ వేసుకునే అవకాశం ఇవ్వాలని కార్మికులు కోరుతున్నా కనుకరించడం లేదని పేర్కొన్నారు. ఇక్కడున్న సిఐ ఎంతసేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతామనే ఆలోచనతో ఉన్నాడని, మీరు కానిస్టేబుల్ నుండి కష్టాలను చూసి సిఐ వరకు వచ్చినవారని మర్చిపోవద్దని సూచించారు. ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మె న్యాయబద్ధమైనది కాంగ్రెస్ ప్రభుత్వం వారి డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story