Jagtial: జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో కలకలం.. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!

Jagtial: జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ర్యాగింగ్ కారణమని బాధితురాలు, కాదని ప్రిన్సిపల్ చెబుతున్నారు.

ANAND, JAGITYAL
Published on: 27 Nov 2026 3:19 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో కలకలం.. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!

జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కళాశాల వసతి గృహంలో (హాస్టల్) ఉంటున్న సదరు విద్యార్థిని గత సాయంత్రం అధిక మొత్తంలో మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన తోటి విద్యార్థినులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది.

వేధింపులే కారణమంటున్న బాధితురాలు:

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బాధిత విద్యార్థిని మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేసింది. తోటి విద్యార్థులు ర్యాగింగ్ తరహాలో వేధిస్తున్నారని, దీనికి కొందరు అధ్యాపకుల సహకారం కూడా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వేధింపులపై కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌లకు గతంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపింది. ఫిర్యాదు చేసిన తర్వాత వేధింపులు మరింత ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ప్రిన్సిపల్ వివరణ

ఆరోపణలను ఖండించిన ప్రిన్సిపల్:

విద్యార్థిని చేసిన ఆరోపణలపై కళాశాల ప్రిన్సిపల్ స్పందిస్తూ.. కళాశాలలో ఎలాంటి ర్యాగింగ్ గానీ, అధ్యాపకుల వేధింపులు గానీ లేవని స్పష్టం చేశారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఇద్దరు విద్యార్థినుల మధ్య జరిగిన చిన్నపాటి వ్యక్తిగత గొడవ కారణంగానే ఆమె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తేలిందని చెప్పారు. బాధితురాలు డోలో 650 మాత్రలు వేసుకుందని, ఈ ఘటనతో కళాశాల యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరణ ఇచ్చారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL