Manthani: మంథనిలో బీజేపీ 'రైతు గోస' బస్సు యాత్ర

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో ‘రైతు గోస - బీజేపీ భరోసా’ బస్సు యాత్ర నిర్వహించారు.

SHANKAR, MANTHANI
Published on: 27 May 2026 6:49 PM IST
Manthani
X

Manthani: మంథనిలో బీజేపీ 'రైతు గోస' బస్సు యాత్ర

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో రైతు గోస బిజెపి భరోసా బస్సు యాత్రలో భాగంగా బిజెపి రాష్ట్ర నాయకుల బృందం పర్యటించారు. మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు బిజెపి రాష్ట్ర నాయకత్వం తెలుసుకున్నారు. ఈ యాత్రలో ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, రామారావు పటేల్, సూర్యనారాయణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి , బిజెపి మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మూడు రోజులుగా రైతు గోస బీజేపీ భరోసా పేరుతో మొదలుపెట్టిన యాత్రలో బిజెపి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కలిసి రైతుల ఇబ్బందులను తెలుసుకొని వారికి అండగా నిలబడడానికి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కిలోమీటర్ల పొడవున వరికుప్పలు వేరకపోయి ఉన్నాయని రైతులను పట్టించుకునే నాధుడు లేడని అన్నారు. మంథని నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సభకు హైదరాబాదు నుండి బస్సులను పిలిపించి జనాలను తరలించారని, రైతు పండించిన పంటను తరలించడానికి లారీలు కరువయ్యాయని హేద్దవా చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో మద్దతు ధర కొరకు ప్రశ్నిస్తే రైతులకు సంకెళ్లు వేసి జైలకు పంపారని, మంథని నియోజకవర్గంలో రైతులు వారి ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డు పై ధర్నా చేస్తే తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి రైతులను వేధిస్తుందని విమర్శించారు.

అసెంబ్లీ బిజెపి ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ డిక్లరేషన్ సభలో రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిచ్చిందని అన్నారు. రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో మేము మా పార్టీ నాయకుల మందిరం ఏ ఊరికి పోతే ఒకరికి లారీలు వస్తున్నాయని ధాన్యం తీసుకు వెళుతున్నారని, మేము ప్రశ్నిస్తేనే వరి ధాన్యం కొంటాం అంటే ప్రతి ఊరు తిరిగి రైతుల ధాన్యం కొనే వరకు ప్రభుత్వ వెంటపడతామని హెచ్చరించారు.

వడ్లు, మక్కలు, సన్ ఫ్లవర్ కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టకుండా ధాన్యాన్ని మద్దతు ధర కల్పించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story