Sircilla: 17వ పోలీస్ బెటాలియన్‌లో విషాదం: ఏఆర్‌ఎస్‌ఐ గోపి మృతి!

Sircilla: రాజన్న సిరిసిల్ల 17వ పోలీస్ బెటాలియన్ ఏఆర్‌ఎస్‌ఐ జాటోత్ గోపి అనారోగ్యంతో కన్నుమూశారు.

KALEEM, SIRICILLA
Published on: 15 Oct 2026 2:41 PM IST
Sircilla
X

Sircilla: 17వ పోలీస్ బెటాలియన్‌లో విషాదం: ఏఆర్‌ఎస్‌ఐ గోపి మృతి!

సిరిసిల్ల: 17వ పోలీస్ బెటాలియన్‌లో ఏఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న జాటోత్ గోపి అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందారు. ఆయన మృతితో బెటాలియన్‌లో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల బెటాలియన్ కమాండెంట్ పి.జె.పి.సి. ఛటర్జీతో పాటు అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బెటాలియన్‌లో నిర్వహించిన శ్రద్ధాంజలి కార్యక్రమంలో కమాండెంట్ ఛటర్జీ జాటోత్ గోపి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన పోలీస్ శాఖకు అందించిన సేవలను స్మరించుకుంటూ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బెటాలియన్ అధికారులు, సిబ్బంది సైతం నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.

జాటోత్ గోపి 2013లో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో అనుభవం, అంకితభావంతో పనిచేస్తూ హెడ్ కానిస్టేబుల్‌గా, అనంతరం ఏఆర్‌ఎస్‌ఐగా పదోన్నతులు పొందారు. పోలీస్ సేవా కాలంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన పలు వీఐపీ బందోబస్తు విధుల్లో విశేష సేవలందించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచినందుకు మొత్తం 14 రివార్డులు అందుకున్నారు.

మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం కొత్తూరు గుజిలి తండాకు చెందిన గోపి పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన అకాల మరణం బెటాలియన్ కుటుంబానికి తీరని లోటని అధికారులు, సిబ్బంది పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ, జాటోత్ గోపి సేవలను స్మరించుకున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA