Sircilla: 17వ టీజీఎస్పీ బెటాలియన్‌లో ఘనంగా వార్షిక క్రీడా పోటీలు 2026

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్‌లోని 17వ TGSP బెటాలియన్‌లో వార్షిక ఇంటర్ కంపెనీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2026 ఘనంగా ప్రారంభమైంది.

KALEEM, SIRICILLA
Published on: 24 July 2026 4:43 PM IST
Sircilla
X

Sircilla: 17వ టీజీఎస్పీ బెటాలియన్‌లో ఘనంగా వార్షిక క్రీడా పోటీలు 2026

Sircilla: సర్దాపూర్‌లో నాలుగు రోజుల పాటు ఇంటర్ కంపెనీస్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్.. శాంతి కపోతాలను ఎగరవేసి ప్రారంభించిన కమాండెంట్ పి.జె.పి.సి. ఛటర్జీ రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్‌లోని 17వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌లో వార్షిక ఇంటర్ కంపెనీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2026 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.

అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్, ఐపీఎస్, టీజీఎస్పీ బెటాలియన్స్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీలను బెటాలియన్ కమాండెంట్ పి.జె.పి.సి. ఛటర్జీ శాంతి కపోతాలను ఎగరవేసి ప్రారంభించారు. అనంతరం కమాండెంట్‌తో పాటు పోటీల్లో పాల్గొంటున్న సిబ్బంది స్పోర్ట్స్ ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో నిరంతరం ఒత్తిడితో పనిచేస్తారని, వారిలో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తిని పెంపొందించడమే ఈ క్రీడా పోటీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

జూలై 24 నుంచి 27 వరకు జరిగే ఈ పోటీల్లో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, షటిల్, చెస్, క్యారమ్, జావెలిన్ త్రో, షాట్‌పుట్, లాంగ్ జంప్, హైజంప్, 100 మీటర్ల పరుగులు, 5 కిలోమీటర్ల రన్నింగ్, తగ్ ఆఫ్ వార్ తదితర క్రీడాంశాలు నిర్వహించనున్నారు.

పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు చివరి రోజు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ ఎం.ఐ. సురేష్, అసిస్టెంట్ కమాండెంట్లు ఎస్. సురేష్, ఎం. రాజు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story