Sircilla: సిరిసిల్ల ఏఆర్ కానిస్టేబుల్ ఖర్దుంగ్ లా మారథాన్ పూర్తి!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ లడక్‌లో నిర్వహించిన 72 కి.మీ. ఖర్దుంగ్ లా అల్ట్రా మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 15 Sept 2026 2:49 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల ఏఆర్ కానిస్టేబుల్ ఖర్దుంగ్ లా మారథాన్ పూర్తి!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ లడక్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఖర్దుంగ్ లా ఛాలెంజ్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. సముద్ర మట్టానికి సుమారు 17,618 అడుగుల ఎత్తులో జరిగిన ఈ కఠినమైన అల్ట్రా మారథాన్‌లో 72 కిలోమీటర్ల పరుగును 13 గంటల 23 నిమిషాల 54 సెకన్లలో విజయవంతంగా పూర్తి చేశారు.

అత్యంత ఎత్తైన కొండ ప్రాంతాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ పట్టుదల, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకున్నారు. అంతేకాకుండా మరుసటి రోజే నిర్వహించిన లడక్ మారథాన్‌లో 42.2 కిలోమీటర్ల పరుగును కూడా అనిల్ పూర్తి చేశారు.

ప్రజాసేవలో విధులు నిర్వర్తిస్తూనే ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లలో పాల్గొని విజయాలు సాధించడం ద్వారా పోలీస్ ఫోర్స్‌లోని యువ సిబ్బందికి అనిల్ ఆదర్శంగా నిలిచారని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. ఖర్దుంగ్ లా పర్వత మార్గం తన శారీరక, మానసిక సామర్థ్యాలకు కఠినమైన పరీక్షగా నిలిచిందన్నారు. ప్రతి అడుగు తన పరిమితులను పరీక్షించినప్పటికీ ఆత్మస్థైర్యాన్ని ఓడించలేకపోయిందని తెలిపారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగి 72 కిలోమీటర్ల పరుగును పూర్తి చేశానని పేర్కొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA