Sircilla: బీజేపీ నాయకుడు మంచికట్ల ప్రసాద్ తల్లి సులోచన మృతి!
Sircilla: తంగళ్లపల్లిలో బీజేపీ నాయకుడు మంచికట్ల ప్రసాద్ తల్లి సులోచన పార్థివదేహానికి నివాళులర్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి.
Sircilla: బీజేపీ నాయకుడు మంచికట్ల ప్రసాద్ తల్లి సులోచన మృతి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం టెక్స్‌టైల్ పార్క్‌కు చెందిన బీజేపీ తంగళ్లపల్లి మాజీ మండల ప్రధాన కార్యదర్శి మంచికట్ల ప్రసాద్ తల్లి మంచికట్ల సులోచన నిన్న సాయంత్రం పరమపదించారు.
ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి నేడు వారి స్వగృహానికి వెళ్లి మంచి కట్ల సులోచన పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం మంచి కట్ల ప్రసాద్‌తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఆసాని రామలింగారెడ్డి, అంకిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, బీజేవైఎం నాయకులు చిందం నరేష్, బూత్ అధ్యక్షులు శ్రీధర్, సిరిపురం బాబు, చిలగాని నరేష్ తదితరులు పాల్గొన్నారు.
మంచికట్ల సులోచన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.




