Sircilla: సిరిసిల్ల 21వ వార్డులో అభివృద్ధి పనులకు భూమిపూజ!

Sircilla: సిరిసిల్లలో రూ. 3 లక్షల జనరల్ ఫండ్‌తో 21వ వార్డులో నూతన మురుగునీటి కాలువ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ భూమిపూజ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 9 Sept 2026 12:59 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల 21వ వార్డులో అభివృద్ధి పనులకు భూమిపూజ!

Sircilla: సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని 21వ వార్డులో అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి బుధవారం భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా నూతన సిమెంట్ మురుగునీటి కాలువ నిర్మాణ పనులను చేపట్టారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. 21వ వార్డులో మురుగునీటి కాలువ సమస్యను స్థానిక కౌన్సిలర్ ఎలుక వెంకటేశం తమ దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ.3 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. నిధులతో నూతన సిమెంట్ మురుగునీటి కాలువ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించినట్లు చెప్పారు.

దశలవారీగా, ప్రణాళికాబద్ధంగా అన్ని వార్డుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. సిరిసిల్ల సమగ్ర అభివృద్ధికి మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తోందన్నారు. అనంతరం వార్డు ప్రజలతో పారిశుధ్యం, ఇతర మున్సిపల్ సేవలపై చైర్‌పర్సన్ మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు ఎలుక వెంకటేశం, వేముల రాములు, మొగిలి నాగరాజు, సాగల హరిప్రసాద్, బత్తుల రమేష్, మాజీ కౌన్సిలర్లు గుండ్లపల్లి పూర్ణచందర్, రిక్కమల్లె సంపత్, ఆకుల కృష్ణ, అడిచర్ల సాయికృష్ణ, మున్సిపల్ ఏఈ నరసింహస్వామి, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story