Sircilla: విద్యుత్ కోతలతో పంటలు ఎండుతున్నాయి: బీజేపీ ధ్వజం!

Sircilla: కరెంట్ కోతలు, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

BABU, VEMULAWADA
Published on: 14 Oct 2026 3:36 PM IST
Sircilla
X

Sircilla: విద్యుత్ కోతలతో పంటలు ఎండుతున్నాయి: బీజేపీ ధ్వజం!

సిరిసిల్ల: విద్యుత్ సరిగా ఇవ్వలేక సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్నాయి, మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ ,అన్నారు. 24గంటల నిరంతర విద్యుత్ చందుర్తి మండలం లోని అన్నీ గ్రామాల లొ కరెంటు కష్టాలతో సరైన సమయానికి రాకపోవడం లో వోల్టేజ్ తక్కువ ఇవ్వడం వలన మోటర్లు స్టార్టర్లు వైరింగ్ కాలిపోవడం వలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వాన్ని 24 గంటల కరెంటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చందుర్తి మండల కేంద్రంలో బుధవారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో, ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

​ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చకపోవడం విచారకరమన్నారు*చందుర్తి మండల కేంద్రంలో నీ వివిధ గొలుసుకట్టు చెరువులు నీళ్లు లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

​రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, కోరారు. నిర్లక్ష్యం వీడకుంటే రైతులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

​ఈ సమావేశంలో బీజేపీ*సీనియర్ నాయకులు అల్లాడి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు మార్త సత్తయ్య, మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లేశం, మూడ పెళ్లి ముఖేష్, సీనియర్ నాయకులు చిలుమల హనుమయ్య చారి పత్తిపాక శ్రీనివాస్, ఎగుమటి శ్రీనివాస్ రెడ్డి, మారుపక దేవయ్య,హాజీమెరా రవి నాయక్,యువ మోర్చా మండల అధ్యక్షులు మోత్కుపల్లి రాజశేఖర్, కిషన్ మోర్చా అధ్యక్షులుచింతకుంట సాగర్, దళిత మోర్చా మండల అధ్యక్షులు, పాటి సుధాకర్ మండల కార్యదర్శి, ఎగోలపు గణేష్, బుర్ల రెడ్డి, రాజు, సురేష్,జలగం శ్రీనివాస్,మేఘన రావ్, పొన్నాల మహేందర్, వెంకటేష్,అయోధ్య పర్షాములు,రాజు,తిరుపతి, ఎల్లయ్య, నవీన్, కృష్ణ స్వామి, సింగం రాకేష్, ప్రమోద్, శేఖర్, రంబాబు,బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA