Sircilla: క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ పథకం లబ్ధిదారుల ఎంపిక!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ పథకాల లబ్ధిదారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ నేతృత్వంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 23 Oct 2026 6:31 PM IST
Sircilla
X

Sircilla: క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ పథకం లబ్ధిదారుల ఎంపిక!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఆర్థిక సహాయ పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను శుక్రవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ నేతృత్వంలో నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి సెలెక్షన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమక్షంలో ఈ ప్రక్రియ చేపట్టారు.

చిన్న వ్యాపారాల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించే పథకం కింద ఆన్‌లైన్‌లో వచ్చిన 32 దరఖాస్తుల నుంచి లక్ష్యానికి అనుగుణంగా ఇద్దరిని ఎంపిక చేశారు. అలాగే ఇ-స్కూటర్‌/ఇ-బైక్‌ పథకం కింద అందిన 28 దరఖాస్తుల నుంచి ఎనిమిది మందిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కుమారస్వామి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజీవ్ కుమార్, ఎంపీడీఓలు, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ సిబ్బంది, క్రిస్టియన్ కమిటీ అధ్యక్షుడు జీవన్, పాస్టర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA