Rajanna Sircilla: రైస్ మిల్లర్లు సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్ ఆదేశం
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రా, బాయిల్డ్ రైస్ మిల్లర్లు నిర్ణీత గడువులోగా సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
Rajanna Sircilla: రైస్ మిల్లర్లు సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్ ఆదేశం
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రా, బాయిల్డ్ రైస్ మిల్లర్లు సీఎంఆర్‌ను నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఆదేశించారు.
యాసంగి, ఖరీఫ్ 2024-25 సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌పై మంగళవారం ఐడీఓసీలో రా, బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి రైస్ మిల్లుకు కేటాయించిన సీఎంఆర్, ఇప్పటివరకు అందించిన సీఎంఆర్ వివరాలను మిల్లుల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సీఎంఆర్‌ను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని కలెక్టర్, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ స్పష్టం చేశారు. గడువులోగా సీఎంఆర్ అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను రైస్ మిల్లర్లు ముందస్తుగా చేసుకోవాలని సూచించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఎఫ్‌సీఐ డీఎంలు, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




