Sircilla: భూభారతి, సాదాబైనామా దరఖాస్తులపై కలెక్టర్ సీరియస్!

Sircilla: కలెక్టర్ గరిమ అగ్రవాల్ తంగళ్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి, భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 7 July 2026 10:35 PM IST
Sircilla
X

Sircilla: భూభారతి, సాదాబైనామా దరఖాస్తులపై కలెక్టర్ సీరియస్!

సిరిసిల్ల: తంగళ్లపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయంలో అధికారుల హాజరు, రికార్డులు, పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

భూ భారతి, సాదాబైనామా దరఖాస్తుల పురోగతిపై ఆరా తీసిన కలెక్టర్.వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. అలాగే కార్యాలయంలోని ఫైళ్లను సక్రమంగా భద్రపరచడంతో పాటు కార్యాలయ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

ఈ తనిఖీలో ఇన్‌చార్జి తహసీల్దార్ మురళి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story