Sircilla: సిరిసిల్ల జడ్పీ స్కూల్‌లో కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ
Sircilla: సిరిసిల్ల జిల్లా వెంకంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఇన్-సర్వీస్ టీచర్ ట్రైనింగ్‌ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా సందర్శించారు.
Sircilla: సిరిసిల్ల జడ్పీ స్కూల్‌లో కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ
Sircilla: విద్యార్థులకు భాష సులభంగా అర్థమయ్యేలా, నిత్య జీవితంలో ఉపయోగించే పదాలతో బోధన సాగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సిరిసిల్ల జిల్లా వెంకంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఇన్-సర్వీస్ టీచర్ ట్రైనింగ్‌ను కలెక్టర్ సందర్శించి ఉపాధ్యాయులతో కలిసి శిక్షణను పరిశీలించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సందర్శించారు. ఉపాధ్యాయులతో కలిసి శిక్షణలో పాల్గొని, బోధన విధానాలపై వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఇన్-సర్వీస్ టీచర్ ట్రైనింగ్‌ను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించిన కలెక్టర్... విద్యార్థి కేంద్రీకృత బోధన, టీఎల్ఎంల వినియోగం, రంగుల ద్వారా ఆకర్షణీయమైన బోధనపై దృష్టి పెట్టాలని చెప్పారు.
తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో నిత్య జీవితంలో ఉపయోగించే పదాలతో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించాలని, అలాగే ఇంగ్లీష్, మ్యాథ్స్ తదితర అంశాల్లో కనీస అభ్యాసన సామర్థ్యాలు పెంపొందేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు.




