Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఓటర్ల జాబితా సవరణపై అఖిలపక్ష భేటీ!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026)పై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.

BABU, VEMULAWADA
Published on: 27 Nov 2026 12:06 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఓటర్ల జాబితా సవరణపై అఖిలపక్ష భేటీ!

సిరిసిల్ల: ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో Special Intensive Revision (SIR) - 2026 కార్యక్రమంపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లు, డూప్లికేట్, మృతి చెందిన వారి పేర్లు తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు, ఫ్యామిలీ మ్యాపింగ్, నోటీసులు జారీ చేసిన ఓటర్ల విచారణ తదితర అంశాలపై చర్చించడం జరిగింది. జిల్లాలో పారదర్శకంగా, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు అన్ని పార్టీలు సహకరించాలని కలెక్టర్ గారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జిల్లా ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA