boinapalli: విలాసాగర్‌లో హమాలీల గళం.. పెన్షన్లు హెల్త్ కార్డులపై సీపీఎం పోరు
boinapalli: రాజన్న సిరిసిల్ల జిల్లా విలాసాగర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో హమాలీ కార్మికుల సమావేశం జరిగింది.
boinapalli: విలాసాగర్‌లో హమాలీల గళం.. పెన్షన్లు హెల్త్ కార్డులపై సీపీఎం పోరు
బోయిన్‌పల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం విలాసాగర్ గ్రామంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో హమాలీ కార్మికుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు హమాలీ కార్మికులను కలిసి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు సరైన భద్రతా సదుపాయాలు లేకపోవడం, ప్రమాద బీమా అందుబాటులో లేకపోవడం, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు హెల్త్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే 55 సంవత్సరాలు పైబడిన కార్మికులకు పెన్షన్ సౌకర్యం లేకపోవడం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఇలాంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హమాలీ కార్మికుల సంక్షేమంపై సరైన దృష్టి సారించడం లేదని సీపీఎం నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా మండల సీపీఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ మాట్లాడుతూ హమాలీ కార్మికులకు 55 సంవత్సరాలు దాటిన తర్వాత నెలకు రూ.5 వేల పెన్షన్ అందించాలని, రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులను ప్రభుత్వ పరంగా గుర్తించి వారికి గుర్తింపు కార్డులు అందించాలని కోరారు. హమాలీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీపీఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విలాసాగర్ గ్రామానికి చెందిన హమాలీ కార్మికులు ఆకుల అంజయ్య, రమేష్, ఐలయ్య, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.




