Sircilla: దీపావళి టపాసుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలి: ఆర్డీవో!
Sircilla: సిరిసిల్లలో దీపావళి టపాసుల విక్రయాల్లో భద్రతా నిబంధనలు పాటించాలని, అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని ఆర్డీవో శ్రీధర్ బాబు బాణసంచా వ్యాపారులను హెచ్చరించారు.
Sircilla: దీపావళి టపాసుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలి: ఆర్డీవో!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా దీపావళి పండుగ సందర్భంగా టపాసుల విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్డీవో శ్రీధర్ బాబు సూచించారు. టపాసులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు నది ఒడ్డున ఏర్పాటు చేయనున్న టపాసుల దుకాణాల యజమానులతో ఆర్డీవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల కేటాయింపులో డ్రా విధానం లేకుండా కేటాయింపులు చేపట్టాలని వ్యాపారులు ఆయనను కోరారు.
దీనిపై స్పందించిన ఆర్డీవో.. టపాసుల దుకాణాల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల నుంచి అన్ని అనుమతులు పొందిన తర్వాతే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేందర్, కమర్షియల్ టాక్స్ ఇన్‌స్పెక్టర్ కిరణ్, టపాసుల దుకాణాల యజమానులు పాల్గొన్నారు.




