Sircilla: గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ బొల్లి లింగం మృతి!

Sircilla: రాజన్న సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో గుండెపోటుతో బీఆర్‌ఎస్ తొలి తరం నాయకుడు, మాజీ ఎంపీటీసీ బొల్లి లింగం మృతి.

KALEEM, SIRICILLA
Published on: 24 Sept 2026 9:20 AM IST
Sircilla
X

Sircilla: గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ బొల్లి లింగం మృతి!

Sircilla: గొల్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ తొలి తరం నాయకుడు, మాజీ ఎంపీటీసీ బొల్లి లింగం (70) గుండెపోటుతో మృతి చెందారు. గురువారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కిందపడిపోయారు.

వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చారు.

బొల్లి లింగం 2001లో ఎంపీటీసీగా పనిచేశారు. గ్రామ అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారని స్థానికులు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీతో అనుబంధం కొనసాగించిన ఆయన, పరిస్థితులు మారినా పార్టీ మారకుండా బీఆర్‌ఎస్‌లోనే కొనసాగారని పార్టీ నాయకులు గుర్తుచేశారు.

స్థానిక రాజకీయాల్లో బొల్లి లింగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, సర్పంచ్‌ కొండ రమేష్‌ గౌడ్‌ గెలుపులో ఆయన కీలకంగా అండగా నిలిచారని నాయకులు తెలిపారు. బొల్లి లింగం మృతితో సర్పంచ్‌ కొండ రమేష్‌ గౌడ్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.

బొల్లి లింగం మృతికి బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు అందే బాలయ్య, బీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కొండ ఆంజనేయులు గౌడ్‌, మాజీ కో-ఆప్షన్‌ సభ్యుడు జబ్బార్‌ తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బొల్లి లింగానికి భార్య హనుమవ్వతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA