Sircilla: అడవుల్లో నీటి వృథాకు అడ్డుకట్ట: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్!

Sircilla: కోనరావుపేట, రుద్రంగి మండలాల అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించి సహజ నీటి ప్రవాహాలు, చెక్‌డ్యామ్‌లను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.

BABU, VEMULAWADA
Published on: 28 Oct 2026 5:23 PM IST
Sircilla
X

Sircilla: అడవుల్లో నీటి వృథాకు అడ్డుకట్ట: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్!

సిరిసిల్ల: కొనరావుపేట మండలం మరిమడ్ల, రుద్రంగి మండలం మానాల,రుద్రంగి అటవీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటన, హాజరైన డిఎఫ్ఓ సత్యనారాయణ,ఎఫ్ఆర్ఓ మాధవి సీతల్ ఇరిగేషన్ అధికారులు మరిమడ్ల లోని జలవాగు నుండి గ్రామానికి త్రాగు నీరు,కొండెం చేరవు, ఊర చెరువు,బోటిమే జల, రుద్రంగి లోని సీమర్లు, గోలేపు లొద్ది నుండి నాగారం చెరువు లను, రెండు గట్ల వాగు క్షేత స్థాయిలో పరిశీలించిన విప్,

దట్టమైన అడవుల్లో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి.. వన్యప్రాణులకు, ప్రజలకు నీటి భరోసా కల్పిస్తాం, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అడవుల్లోని సహజ నీటి వనరుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ, రుద్రంగి, కోనరావుపేట మండలాల పరిధిలోని దట్టమైన అడవుల్లో ఏడాది పొడవునా సహజసిద్ధంగా ప్రవహించే వాగులు, వంకలను పరిశీలించాం.

వృథాగా పోతున్న నీటిని ఒడిసిపడతాం, మరిమడ్ల అడవిలోని జాలవాగు, కొండ చెరువు తదితర ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసేలా చెక్‌డ్యామ్‌లు, చిన్న చెరువులు, కుంటలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటాం.

వన్యప్రాణులకు వేసవిలోనూ నీటి భరోసా: అడవుల్లో నీటిని నిల్వ చేయడం ద్వారా వన్యప్రాణులు, పక్షులు, ఇతర జీవరాశులకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. సహజ నీటి ప్రవాహాలను నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలమట్టం పెరిగేందుకు, పరిసర ప్రాంతాల్లో నీటి లభ్యత మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. మరిమడ్ల–మానాల మధ్య, సీమర్ల ఒర్రె, సూరమ్మ బుగ్గ ఒర్రె తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న చెక్‌డ్యామ్‌లను పరిశీలించి, అవసరమైన చోట కొత్త నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించాం.

రెండు గట్ల వాగు తదితర ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసి, సాధ్యమైన చోట నాగారం చెరువుకు మళ్లించే అవకాశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. జాలవాగు వద్ద నీటి నిల్వ సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైతే పైప్‌లైన్ ద్వారా గ్రామానికి తాగునీరు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తాం. బుగ్గ రాజేశ్వర స్వామి సమీపంలోని చెక్‌డ్యామ్ ద్వారా నీటిని నిల్వ చేయడం వల్ల సమీప గిరిజన తండాలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపడతాం.

అటవీ శాఖ డీఎఫ్‌ఓ సత్యనారాయణ, సంబంధిత అధికారులు, ఇరిగేషన్ ఇంజినీర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి అంచనాలు రూపొందించాలని సూచించాం. అందుబాటులో ఉన్న అటవీ శాఖ నిధులతో పాటు, అవసరమైన అదనపు నిధులను ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తాం. భవిష్యత్తులో ఎండలు, నీటి కొరత తీవ్రత పెరిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సహజ నీటి వనరులను సంరక్షించుకోవడం అత్యంత అవసరం.

నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్న పథకాల నిధులను వినియోగించుకొని చెక్‌డ్యామ్‌లు, కుంటలు, చిన్న చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం. తొలి విడతలో గుర్తించిన ప్రాంతాలతో పాటు, రైతులు కోరిన ఇతర అటవీ ప్రాంతాలను కూడా పరిశీలించి అవసరమైన పనులపై కార్యాచరణ రూపొందిస్తాం. అడవుల్లో నీటిని నిల్వ చేయడం ద్వారా వన్యప్రాణుల సంరక్షణతో పాటు, రైతులు, గ్రామీణ ప్రజలు, పశుపక్షాదులకు కూడా ప్రయోజనం చేకూర్చడమే మా లక్ష్యం.

అడవుల్లో సహజంగా ప్రవహిస్తున్న నీటిని వృథాగా పోనివ్వకుండా ఒడిసిపడతాం. చెక్‌డ్యామ్‌లు, కుంటలు, చిన్న చెరువులను పునరుద్ధరించి వన్యప్రాణులకు నీటి భద్రత కల్పించడంతో పాటు, భూగర్భ జలాలను పెంపొందించి సమీప గ్రామాల తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. నిధుల విషయంలో వెనుకాడకుండా, అటవీ మరియు ఇరిగేషన్ శాఖల సమన్వయంతో అవసరమైన పనులను వేగవంతం చేస్తాం.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA