Sircilla: జిల్లెల్ల బస్టాండ్‌కు మెట్లేవి? ఏళ్లుగా ప్రయాణికుల నరకయాతన!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల బస్టాండ్‌లో మెట్లు లేక ప్రయాణికుల తీవ్ర అవస్థలు. రోడ్డు విస్తరణ తవ్వకాలతో ఎత్తులో మిగిలిన బస్ షెల్టర్.
Sircilla: జిల్లెల్ల బస్టాండ్‌కు మెట్లేవి? ఏళ్లుగా ప్రయాణికుల నరకయాతన!
Sircilla: రోడ్డు విస్తరణతో గుంత.. ఏళ్లుగా మెట్లు లేక ప్రయాణికుల అవస్థలు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగ్గళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామ బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా బస్టాండ్ ముందు ఉన్న ఎత్తు గడ్డను తవ్వడంతో బస్ షెల్టర్ రోడ్డుకు చాలా ఎత్తులో మిగిలిపోయింది. అయితే పనులు పూర్తై ఏళ్లు గడుస్తున్నా బస్టాండ్‌కు మెట్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు బస్సు కోసం బస్ షెల్టర్ ఎక్కడం, దిగడం కష్టంగా మారింది. సంబంధిత అధికారులు ఈ సమస్యను పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్‌కు మెట్లు నిర్మించి, ప్రయాణికులకు సురక్షితమైన రాకపోకల సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.




