Yellareddypet: బుగ్గ కృష్ణమూర్తి శర్మ మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవం

Yellareddypet: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బుగ్గ కృష్ణమూర్తి శర్మ - మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 12 Nov 2026 11:01 PM IST
Yellareddypet
X

Yellareddypet: బుగ్గ కృష్ణమూర్తి శర్మ మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవం

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, తిమ్మాపూర్ సొసైటీ వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి శర్మ, ఆయన సతీమణి మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి.

వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు, పరస్పర నమ్మకం, గౌరవం, ఆప్యాయతలతో సాగుతున్న తమ ప్రయాణంలో మరో మధురమైన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పలువురు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

జర్నలిజం రంగంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ తనవంతు పాత్ర పోషిస్తున్న బుగ్గ కృష్ణమూర్తి శర్మకు పాత్రికేయ మిత్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, వారి వైవాహిక జీవితం ప్రేమానురాగాలతో కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఒగ్గు బాలరాజు యాదవ్, గౌరవ అధ్యక్షుడు బండారి బాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు కులేరి కిషోర్ కుమార్, పెంటం శ్రీనివాస్, పద్మారెడ్డి, ప్రవీణ్, మహేష్ చంద్ర తదితరులు పాల్గొని దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA