Sircilla: కర్రీ అడిగేందుకు వెళ్లిన వ్యక్తిపై గొడ్డలితో దాడి
Sircilla: సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో కర్రీ అడిగేందుకు పక్కింటికి వెళ్లిన వ్యక్తిపై గొడ్డలితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Sircilla: కర్రీ అడిగేందుకు వెళ్లిన వ్యక్తిపై గొడ్డలితో దాడి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నంలోకి కర్రీ కోసం పక్కింటికి వెళ్లిన వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇందిరానగర్‌కు చెందిన మోతె రాజు అన్నంలోకి కర్రీ కోసం పక్కింట్లోని మామిడాల రాజు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో పాత గొడవలను మనసులో పెట్టుకుని మామిడాల రాజు, అతని తల్లి అక్కవ్వ తన కుమారుడిపై దాడికి పాల్పడ్డారని మోతె రాజు తల్లి ఆరోపించారు.
గొడ్డలితో దాడి చేయడంతో మోతె రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
Next Story




