Sircilla: నిరుపేద కుటుంబానికి మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ చేయూత!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని 34వ వార్డులో నిరుపేద కుటుంబానికి చెందిన గజ్జంగి కనకవ్వ నూతన గృహప్రవేశం సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ చేయూత అందించారు.

KALEEM, SIRICILLA
Published on: 20 Nov 2026 8:47 AM IST
Sircilla
X

Sircilla: నిరుపేద కుటుంబానికి మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ చేయూత!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని 34వ వార్డులో నిరుపేద కుటుంబానికి చెందిన గజ్జంగి కనకవ్వ నూతన గృహప్రవేశం సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ ఆర్థిక సహాయం అందించారు. కనకవ్వ కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న దార్ల సందీప్.. వారి ఇంట్లో నూతన గృహప్రవేశ వేడుక సంతోషంగా జరగాలనే ఉద్దేశంతో తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యాన్ని అందించాలని నిర్ణయించారు.

తాను అందుబాటులో లేకపోవడంతో వార్డు పెద్దల ద్వారా కనకవ్వ కుటుంబానికి బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కనకవ్వతో పాటు కుటుంబ సభ్యులకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన సందేశాన్ని వార్డు పెద్దల ద్వారా పంపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA