Sircilla: ఎల్ నినోకు అనుగుణంగా యాసంగి సాగు: ఏఈఓ లతశ్రీ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ముష్టిపల్లిలో ఖేత్ బచావో అభియాన్ సదస్సు జరిగింది. ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటలు వేయాలని ఏఈఓ లతశ్రీ సూచించారు.
Sircilla: ఎల్ నినోకు అనుగుణంగా యాసంగి సాగు: ఏఈఓ లతశ్రీ!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ పరిధిలోని ముష్టిపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్, యాసంగి పంటలపై ఎల్ నినో ప్రభావం అనే అంశాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణాధికారి లతశ్రీ మాట్లాడుతూ.. భూసారాన్ని కాపాడుకునేందుకు రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు.
ఎరువులు, పురుగుమందులను అవసరానికి అనుగుణంగా సరైన మోతాదులో వినియోగించాలని తెలిపారు. ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని యాసంగి సీజన్‌లో అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోలగం వైష్ణవి నాగరాజు, ముష్టిపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.




