Sircilla: గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ‘ఓపెన్ హౌస్’

Sircilla: గంభీరావుపేట పిఎస్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్. పోలీసు విధివిధానాలు, సైబర్ నేరాలు, ఫింగర్‌ప్రింట్ పరికరాలపై అవగాహన కల్పించిన సిఐ ఓ. వెంకటేష్.

KALEEM, SIRICILLA
Published on: 23 Oct 2026 6:11 PM IST
Sircilla
X

Sircilla: గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ‘ఓపెన్ హౌస్’

రాజన్న సిరిసిల్ల జిల్లా: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఓ. వెంకటేష్ పోలీసుల విధులు, బాధ్యతలు, చట్టాలు, ఆధునిక పోలీసింగ్ విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

పోలీస్ స్టేషన్‌లో నిర్వహించే రోజువారీ విధులు, నేరాల దర్యాప్తులో ఫింగర్‌ప్రింట్ పరికరాల వినియోగం, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నేరాల నియంత్రణ, నేరస్థుల గుర్తింపు, దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు.

ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణలో పోలీసుల పాత్రను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA