Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజావాణికి 152 దరఖాస్తులు: కలెక్టర్ గరిమ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 152 దరఖాస్తులు అందాయి. గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజావాణికి 152 దరఖాస్తులు: కలెక్టర్ గరిమ!
రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 152 దరఖాస్తులు అందాయి. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో నిర్వహించిన ప్రజావాణిలో 120 దరఖాస్తులు రాగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో 3, వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో 5 దరఖాస్తులు అందాయి. అలాగే జిల్లాలోని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 24 దరఖాస్తులు స్వీకరించారు.
వీటిలో ఇల్లంతకుంటలో 13, గంభీరావుపేటలో 4, తంగళ్లపల్లిలో 3, వీర్నపల్లిలో 2, వేములవాడ అర్బన్‌లో 3, వేములవాడ రూరల్‌లో 1, ఎల్లారెడ్డిపేటలో 2, కోనరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు అందాయి. బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి మండలాల్లో ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రెవెన్యూ డివిజన్, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించాలని, అన్ని దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తామని పేర్కొన్నారు.




