Sircilla: సీఎం పర్యటన వేళ సిరిసిల్లలో ముందస్తు అరెస్టుల కలకలం!
Sircilla: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సిరిసిల్లలో పోలీసులు ముందస్తు అరెస్టులు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు మరియు ఆటో యూనియన్ నాయకుల అదుపులోకి.
Sircilla: సీఎం పర్యటన వేళ సిరిసిల్లలో ముందస్తు అరెస్టుల కలకలం!
Sircilla: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో పాటు ఆటో యూనియన్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా సుమారు 200 మంది నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, ఆటో యూనియన్ నాయకులను వారి ఇళ్ల వద్దే అదుపులోకి తీసుకోవడంతో పాటు, పలువురిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఆటో యూనియన్ నాయకుల ముందస్తు అరెస్టులు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.




