Sircilla: రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొన్న ప్రైవేట్ బస్సు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్కూల్ బస్సును ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో అద్దాలు పగిలి, గాజు ముక్కలు తగిలి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

KALEEM, SIRICILLA
Published on: 5 Sept 2026 10:36 AM IST
Sircilla
X

Sircilla: రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొన్న ప్రైవేట్ బస్సు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న స్కూల్ బస్సును అప్పారెల్ పార్కు లోని పంక్చువేట్ సంస్థకు చెందిన ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. వేగంగా వచ్చిన ప్రైవేట్ బస్సు స్కూల్ బస్సును ఢీకొనడంతో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. అద్దాలు పగిలిపోవడంతో గాజు ముక్కలు బస్సులోకి దూసుకెళ్లి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story