Sircilla: ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ 15 నుంచి నేత్ర పరీక్షలు!
Sircilla: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్ 15 నుంచి ప్రత్యేక నేత్ర పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు.
Sircilla: ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ 15 నుంచి నేత్ర పరీక్షలు!
Sircilla: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సమగ్ర నేత్ర పరీక్షలు నిర్వహించేందుకు సెప్టెంబర్ 15, 2026 నుంచి ప్రత్యేక నేత్ర పరీక్షా శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు.
ఆర్‌బీఎస్‌కే కార్యక్రమంపై వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, ఏఎన్‌ఎంలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేత్ర పరీక్షా శిబిరాల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నో స్కూల్ లెఫ్ట్ – నో చైల్డ్ లెఫ్ట్’ లక్ష్యంతో జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నేత్ర పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఏ విద్యార్థి కూడా నేత్ర సమస్యలతో గుర్తింపునకు దూరం కాకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. విద్యార్థుల్లో దృష్టి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలు, కళ్లద్దాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రతి పాఠశాలలో నేత్ర పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, పరీక్షల వివరాలను సక్రమంగా నమోదు చేసి, అవసరమైన విద్యార్థులకు ఫాలోఅప్ సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగేందర్ బాబు, ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ నయీమ్‌జహా, డాక్టర్ సంపత్ కుమార్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, డీపీఓ ఎన్‌హెచ్‌ఎం రాజేందర్, వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.




