Sircilla: దళిత మహిళపై కులం పేరుతో దూషణ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేటలో భూ వివాదం నేపథ్యంలో దళిత మహిళను దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ.

KALEEM, SIRICILLA
Published on: 10 Nov 2026 8:55 PM IST
Sircilla: దళిత మహిళపై కులం పేరుతో దూషణ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
X

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో దళిత మహిళ, ఆమె కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించి, చంపుతామని బెదిరించినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

దమ్మన్నపేట గ్రామానికి చెందిన అవునూరి సంధ్య (42), తన భర్త శంకర్‌తో కలిసి గ్రామంలోని 1.20 గుంటల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే, సదరు భూమి తమదేనంటూ అదే గ్రామానికి చెందిన జనగామ సుశీల, ఆమె కుమారుడు జనగామ చిరంజీవి, మహేష్, మంగళి బాలరాజు తదితరులు తన ఇంటికి వచ్చి తనను, తన భర్తను కులం పేరుతో దూషిస్తూ అసభ్య పదజాలంతో తిట్టారని, తనతో పాటు కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించినట్లు సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు నవంబర్ 9న గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో ఎస్సై ఆర్. బాలరాజు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నవంబర్ 10న సిరిసిల్ల డీఎస్పీ కె. నాగేంద్రచారి సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA