Sircilla: నాణ్యమైన దర్యాప్తుతో నేరస్తులకు శిక్షలు పడాలి: ఎస్పీ గితే!
Sircilla: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్షలు పడేలా పోలీసు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశించారు.
Sircilla: నాణ్యమైన దర్యాప్తుతో నేరస్తులకు శిక్షలు పడాలి: ఎస్పీ గితే!
రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నేరస్తులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా పోలీసు అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, స్టేషన్ రైటర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోక్సో, ఎస్సీ, ఎస్టీ, మహిళలపై నేరాలు, గంజాయి తదితర కేసుల్లో పక్కా సాక్ష్యాధారాలు సేకరించి, దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. న్యాయస్థానాల్లో కేసులు పటిష్టంగా నిలబడేలా దర్యాప్తు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కె. ఝాన్సీ (అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్), రజినీకాంత్ (అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్), విక్రాంత్ (అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్) ఫిర్యాదు స్వీకరణ నుంచి కేసు నమోదు, విచారణలో పాటించాల్సిన చట్టపరమైన విధానాలు, సాక్ష్యాధారాల ప్రాముఖ్యత, చార్జిషీట్ దాఖలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్ఐలు, స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు.




