Sircilla: సిరిసిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ చేసిన ఎస్పీ మహేష్ బి. గితే

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేష్ బి. గితే దసరా ప్రత్యేక పూజలు, ఆయుధ పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు.

KALEEM, SIRICILLA
Published on: 20 Oct 2026 5:28 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ చేసిన ఎస్పీ మహేష్ బి. గితే

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ, పోలీసు వాహనాలకు వాహన పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విజయదశమి పండుగ ప్రజలందరికీ అన్ని రంగాల్లో విజయాలను అందించాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA