Sircilla: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన: సిరిసిల్లలో రూట్ భద్రత పరిశీలన!
Sircilla: సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన రూట్ భద్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ మహేష్ బి. గితే హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు పటిష్ట బందోబస్తుకు ఆదేశం.
Sircilla: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన: సిరిసిల్లలో రూట్ భద్రత పరిశీలన!
సిరిసిల్ల: ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈరోజు సాయంత్రం పోలీస్ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్‌ను పరిశీలించారు.
హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ఉన్న మార్గాన్ని ప్రత్యేకంగా పరిశీలించిన ఎస్పీ.. రూట్ క్లియరెన్స్, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు, బారికేడ్ల ఏర్పాటు, ఇతర భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు గణేష్, శ్రీనివాస్ ఉన్నారు.




