Sircilla: పిల్లల ఎదుగుదలకు ప్రతి నెలా బరువు తూయించాలి: అధికారులు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బాలమల్లుపల్లి అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం ప్లస్ ప్రాధాన్యత, చిన్నారుల పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Sircilla: పిల్లల ఎదుగుదలకు ప్రతి నెలా బరువు తూయించాలి: అధికారులు!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల సెక్టార్ పరిధిలోని బాలమల్లుపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం ప్లస్‌పై పది నిమిషాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాద యెల్లయ్య, ఉప సర్పంచ్ డి.రాజు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వనిత, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ వాసాల రాజిరెడ్డితో పాటు గ్రామ పెద్దలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోషకాహార లోపం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు బాలామృతం ప్లస్ ప్రాధాన్యత, దాని ద్వారా కలిగే పోషక ప్రయోజనాలను వివరించారు. పిల్లల ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి నెలా తప్పనిసరిగా బరువు తూయించాలని సూచించారు.
ఆరు సంవత్సరాల లోపు వయస్సు పిల్లల జీవితంలో అత్యంత కీలకమని, ఈ దశలోనే మెదడు ఎదుగుదల వేగంగా జరుగుతుందని తెలిపారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారిని చురుకుగా ఉంచాలని, ప్రభుత్వం అందిస్తున్న అంగన్వాడీ సేవలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు.




