Sircilla: వన్‌పల్లి దసరా గొడవ కేసు: నిందితుడికి రిమాండ్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్‌పల్లిలో దసరా పండుగ రోజు జరిగిన గొడవ కేసులో నిందితుడు దాసరి పోచయ్యను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

KALEEM, SIRICILLA
Published on: 10 Nov 2026 8:13 PM IST
Sircilla
X

Sircilla: వన్‌పల్లి దసరా గొడవ కేసు: నిందితుడికి రిమాండ్!

రాజన్న సిరిసిల్ల జిల్లా: దసరా పండుగ రోజున వీర్నపల్లి మండలం వన్‌పల్లిలో జరిగిన గొడవకు సంబంధించి నమోదైన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాలను సేకరించారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు దసరి పోచయ్య (తండ్రి నంపల్లి)ను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా గొడవలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వీర్నపల్లి పోలీసులు తెలిపారు. ప్రజలు పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA