Vemulawada: వేములవాడ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి!
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్‌కు ఏఐటీయూసీ నేతలు వినతిపత్రం సమర్పించారు. తగ్గించిన వేతనాలను పెంచాలని, ₹25 లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Vemulawada: వేములవాడ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి!
వేములవాడ: వేములవాడ మున్సిపల్ కమిషనర్‌కు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నియోజకవర్గ నాయకుడు కడారి రాములు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మున్సిపల్ కార్మికులు, పంప్ ఆపరేటర్లు, డ్రైవర్ల జీతాలను తగ్గించడం సరైన పద్ధతి కాదని, తగ్గించిన వేతనాలను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలో అయ్యోరిపల్లె, లక్ష్మీపురం, శాత్రాజుపల్లె, నాంపల్లి, కోనాయపల్లె, అనంతపల్లె వంటి విలీన గ్రామాలతో వార్డులు, పురపాలక పరిధి పెరిగినప్పటికీ, దానికి తగినట్లుగా సిబ్బంది సంఖ్య పెరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానాల్లో ఖాళీలను భర్తీ చేయలేదని, విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వడం లేదని, తక్షణమే కొత్త సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డులతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రమాదవశాత్తు కార్మికులు మరణిస్తే రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. అంతేకాకుండా కార్మికులకు సబ్బులు, నూనెలు, రక్షణ పరికరాలు, పనిముట్లు పూర్తిస్థాయిలో అందించి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు.




