Sircilla: రోడ్డుపై కుప్పకూలిన మహిళకు అండగా ఎల్లారెడ్డిపేట పోలీసులు!
Sircilla: ఎల్లారెడ్డిపేటలో ఫిట్స్‌తో రోడ్డుపై పడిపోయిన మహిళకు సకాలంలో చికిత్స అందించిన కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్‌లను డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు.
Sircilla: రోడ్డుపై కుప్పకూలిన మహిళకు అండగా ఎల్లారెడ్డిపేట పోలీసులు!
రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజల రక్షణే కాదు.. ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడం కూడా పోలీసుల బాధ్యతేనని ఎల్లారెడ్డిపేట పోలీసులు చాటిచెప్పారు. ఫిట్స్‌తో రోడ్డుపై కుప్పకూలిన మహిళకు సకాలంలో సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్న పోలీసులను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఐపీఎస్ అభినందించారు.
ఎల్లారెడ్డిపేట మండలంలోని మొదటి బైపాస్ రోడ్డుపై ఓ మహిళ ఫిట్స్‌తో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనను గమనించిన కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ వెంటనే స్పందించారు. మహిళకు ప్రథమ చికిత్స అందించి, ఆపద సమయంలో అండగా నిలిచారు. పోలీసుల సకాల స్పందనతో మహిళకు సహాయం అందడంతో పలువురు వారి సేవలను అభినందించారు.
ఈ ఘటనకు సంబంధించిన జిల్లా పోలీస్ శాఖ అధికారిక సోషల్ మీడియా పోస్టును పరిశీలించిన రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు. విధి నిర్వహణలో మానవత్వాన్ని చాటుకున్న కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ సేవలను ప్రత్యేకంగా అభినందించారు. వారి సేవలను గుర్తించి తగిన విధంగా ప్రశంసించడంతో పాటు రివార్డులు అందించాలని అధికారులను సూచించారు.
ఆపదలో ఉన్న వారికి సహాయం అందిస్తూ ప్రజలకు అండగా నిలవడం పోలీసుల సామాజిక బాధ్యతలో భాగమని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. ఎల్లారెడ్డిపేట పోలీసుల మానవతా దృక్పథంపై ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు.




