Sircilla: రథోత్సవంలో అస్వస్థతకు గురైన భక్తురాలికి మహిళా పోలీసుల సాయం!

Sircilla: ఎల్లారెడ్డిపేట వేణుగోపాలస్వామి రథోత్సవంలో ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్న భక్తురాలు రాజమణికి మహిళా కానిస్టేబుళ్లు స్వప్న, రోజా ప్రథమ చికిత్స అందించి కాపాడారు.

KALEEM, SIRICILLA
Published on: 25 Nov 2026 8:18 AM IST
Sircilla
X

Sircilla: రథోత్సవంలో అస్వస్థతకు గురైన భక్తురాలికి మహిళా పోలీసుల సాయం!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా విధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు. ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన వేణుగోపాలస్వామి రథోత్సవంలో అపస్మారక స్థితికి చేరుకున్న ఓ భక్తురాలికి తక్షణ ప్రథమ చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు సకాలంలో స్పందించారు.

మంగళవారం జరిగిన రథోత్సవంలో స్వామివారిని దర్శించుకుంటూ కొబ్బరికాయ కొట్టే సమయంలో రాజమణి అనే భక్తురాలికి ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి కిందపడిపోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు స్వప్న, రోజా వెంటనే స్పందించి స్థానికుల సహకారంతో ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. వారి సమయస్ఫూర్తితో కొద్దిసేపటికే రాజమణి తిరిగి మెలకువలోకి వచ్చారు.

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ఆపదలో ఉన్న భక్తురాలికి సకాలంలో సహాయం అందించిన మహిళా కానిస్టేబుళ్లు స్వప్న, రోజాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేకంగా అభినందించారు. పోలీసుల విధి నిర్వహణలో బాధ్యతతో పాటు మానవతా విలువలు కూడా ఎంత ముఖ్యమో ఈ ఘటన చాటిచెప్పింది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA